శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు. జగదీష్ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం నందు పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరని శ్రీనివాసులు గారు, పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ కె. మురళీమోహన్ గారు, టీటీడీ పాలకమండలి సభ్యులు, స్విమ్స్ గవర్నింగ్ కాన్సిల్ సభ్యులు మరియు బర్డ్ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ సదాశివ రావు గారు మరియు తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గార్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలు సమర్పించి శాలువలతో సత్కరించారు
స్విమ్స్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డా|| గుడారు జగదీష్ గారు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి టీటీడీ కి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వీరు ఆకాంక్షించారు.




