శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు. జగదీష్ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం నందు పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ టీటీడీ పాలకమండల్ సభ్యులు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారు, శ్రీ రాఘవేంద్ర గారు, రామచంద్రాపురం మండలం మాజీ ఎంపీపీ శ్రీ కేశవులు నాయుడు గార్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలు సమర్పించి శాలువలతో సత్కరించారు
స్విమ్స్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డా || గుడారు జగదీష్ గారు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి టీటీడీ కి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వీరు ఆకాంక్షించారు.


