శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు. జగదీష్ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం నందు టీటీడీ పాలకమండలి సభ్యులు, స్విమ్స్ గవర్నింగ్ కాన్సిల్ సభ్యులు మరియు బర్డ్ హాస్పిటల్ ట్రస్టీ సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివ రావు గారు స్విమ్స్ మరియు బర్డ్ హాస్పిటల్ కు టిటిడి బోర్డు మెంబర్ గా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మరియు స్విమ్స్ లో పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు టీటీడీ ద్వారా తన వంతు సహాయాన్ని అందిస్తాన్ని చర్చించడం జరిగింది. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్.జగదీష్ గారి నేతృత్వంలో హాస్పిటల్స్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం పుష్ప గుచ్చములు సమర్పించి శాలువలతో సత్కరించారు.
