దేశవ్యాప్తంగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు శ్రీవారి వైద్య సేవలో భాగం కావాలి
ఆత్మహత్యల నివారణపై స్విమ్స్‌లో అవగాహన కార్యక్రమం
డాక్టర్ గుడారు జగదీష్ ఆధ్వర్యంలో “Changing the Narrative on Suicide” పై ప్రత్యేక కార్యక్రమం
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్ ఓపిడి బ్లాక్ శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు 10.09.26 సాయంత్రం 5:00 గంటలకు నిర్వహించిన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్ గారి ఆధ్వర్యంలో స్విమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ మాట్లాడుతూ ప్రముఖ నిపుణుల సేవలు స్విమ్స్‌కు మరింత బలం
దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ప్రొఫెసర్లు, మానసిక వైద్య నిపుణులను గుర్తించి టీటీడీ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవారి వైద్య సేవలో స్విమ్స్ లో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ప్రముఖ నిపుణులు తమకు అనుకూలమైన సమయంలో స్విమ్స్‌కు వచ్చి మూడు రోజుల పాటు సేవలందించేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా వారు ఒకవైపు వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులకు బోధన అందించడంతో పాటు, మరోవైపు ఔట్‌పేషెంట్ విభాగంలో రోగులకు నిపుణుల వైద్య సేవలు అందించవచ్చని చెప్పారు. అలాగే ఆయా విభాగాల భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన సూచనలు, ఆధునిక వైద్య విధానాలపై నిపుణుల సలహాలు పొందవచ్చని తెలిపారు.
మానసిక వైద్య విభాగం దేశవ్యాప్తంగా ప్రముఖ నిపుణులను గుర్తించి శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములను చేయాలని, దీనివల్ల స్విమ్స్‌లో వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా “Changing the Narrative on Suicide” అనే ఇతివృత్తంపై ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య ఆలోచనలకు గురయ్యే వారిని గుర్తించడం, వారికి సకాలంలో మానసిక సహాయం అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో బెంగళూరులోని NIMHANS ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఎం. ప్రత్యేక అతిథిగా పాల్గొని ఆత్మహత్యల నివారణపై విశిష్టమైన ఉపన్యాసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందించారు.
ప్రతి ప్రాణం విలువైనదే.. ప్రతి ఒక్కరికీ అండగా నిలుద్దాం
మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో గుర్తించి, అవసరమైన వైద్య మరియు మానసిక సహాయం అందించడం ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఆత్మహత్యల నివారణలో వైద్య సంస్థలతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజం కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించి, సమస్యలో ఉన్న వ్యక్తులతో సానుభూతితో మాట్లాడటం, వారికి భరోసా కల్పించడం ద్వారా సానుకూల మార్పు తీసుకురావచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్వివిధ విభాగాధిపతులు, సైకియాట్రీ విభాగాపు, వైద్యులు, అధ్యాపకులు, రెసిడెంట్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



