శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు. జగదీష్ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం నందు పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో తుడా చైర్మన్ మరియు టిటిడి పాలక మండలీ ఎక్స్ అఫిషియో సభ్యులు శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి గారు, టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ శ్రీ బి.శ్రీధర్ వర్మ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ తుడా చైర్మన్ జి. నరసింహ యాదవ్ గారు, రాష్ట్ర గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మరియు తిరుపతి మాజీ శాసనసభ్యులు శ్రీమతి. మన్నూరు సుగుణమ్మ గారు, సి.ఐ.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కందారపు మురళీగారు, కొమ్మినేని మోహన్ బాబు గారు, శ్రీ లెక్కల సురేష్ గార్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలు సమర్పించి శాలువలతో సత్కరించారు
స్విమ్స్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డా|| గుడారు జగదీష్ గారు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి టీటీడీ కి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వీరు ఆకాంక్షించారు.





