శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్శిటీ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ విద్యార్థులు చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రో బాల్ టోర్నమెంట్ నందు ఉత్సాహo గా పాల్గొని క్రీడా పోటీల్లో స్విమ్స్ విద్యార్థులు విజేతలు గా నిలిచారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ గుడారు జగదీష్ గారు విజేతలకు ట్రోఫిని అందజేస్తూ, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఫిజియోథెరపీ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, శారీరక దారుఢ్యం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి రోజు ఒక గంటపాటు క్రీడాలను ఆడాలని సూచించారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, టోర్నమెంట్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు.
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ త్రో బాల్ టోర్నమెంట్ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహనను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుంది. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా|| గుడారు జగదీష్ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపి ప్రిన్సిపాల్ డా॥ కె. మాధవి, స్విమ్స్ స్పోర్ట్స్ బోర్డు ఛైర్మన్ డా॥ సుభాష్, ఫిజికల్ డైరెక్టర్ మధుబాబు గార్లు పాల్గొన్నారు.
