ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గార్ల చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక అవార్డుల స్వీకరణ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో స్విమ్స్‌కు కీర్తి కిరీటం
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్‌ను కలిసిన అవార్డు గ్రహీతలు
సెప్టెంబర్ 07,2026
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)*కు చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన వైద్యులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకుని స్విమ్స్ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 05.09.26 వ తేదీన విజయవాడ లో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో స్విమ్స్‌కు చెందిన జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వై. ముత్తీశ్వరయ్య మరియు సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బి. మణిలాల్ రాష్ట్రస్థాయి మెడిసిన్ విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు.
అవార్డులు అందుకున్న వైద్యులు ఈ రోజు 07.90.26 స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ వారిని ఘనంగా అభినందించారు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్విమ్స్‌కు చెందిన డా॥ వై. ముత్తీశ్వరయ్య మరియు ప్రొఫెసర్ డా॥ బి. మణిలాల్ గార్లు ప్రతిష్ఠాత్మక అవార్డులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు.
వైద్య సేవలు, బోధన, పరిశోధన రంగాల్లో వారు అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు లభించడం స్విమ్స్‌కు గర్వకారణమని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్ తెలిపారు
వారి సేవలు స్విమ్స్ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.



