శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు. జగదీష్ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం నందు పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ గుడారు జగదీష్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో డా. యలవర్తి కార్తిక్ చౌదరి గారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, విజయవాడ,
డా॥మారుతీకృష్ణ గారు, ఎం.డి., మారుతీహాస్పిటల్స్, తిరుపతి, డా॥ కోడూరు బాలసుబ్రమణ్యం గారు, ఛైర్మన్ ఎలైట్ హాస్పిటల్స్, తిరుపతి కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలు సమర్పించి శాలువలతో సత్కరించారు.
స్విమ్స్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డా॥ గుడారు జగదీష్ గారు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి టీటీడీ కి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వీరు ఆకాంక్షించారు.



