శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు. జగదీష్ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం నందు పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి మరియు టిటిడి పాలక మండలీ సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాదికారిక సంస్థ (SAAP) చైర్మన్ శ్రీ అనిమిని రవి నాయుడు గారు, తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ శ్రీ నైనార్ మహేష్ యాదవ్, ఎస్ వి ఆర్ ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, తిరుపతి,హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు,
B. మునిస్వామి గార్లు తదితరులు కలసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలు సమర్పించి శాలువలతో సత్కరించారు
స్విమ్స్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డా|| గుడారు జగదీష్ గారు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి టీటీడీ కి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వీరు ఆకాంక్షించారు.


